పవన్ కల్యాణ్ బలం రోజు రోజుకీ పెరుగుతోంది. సినీలోకం ఒకొక్కరూ పవన్ గురించి గొప్పగా మాట్లాడడం మొదలెట్టారు. ఇప్పుడు స్లార్లు కూడా పవన్ తో చేయి కలపడానికి ఉత్సాహం చూపిస్తున్నారు. ఈ లిస్ట్‌లో నందమూరి బాలకృష్ణ పేరుండడం ఆశ్చర్యం కలిగిస్తోంది. పవన్ స్పీచ్ బాలయ్యనూ ఆకట్టుకొందట. పవన్ లాంటి వ్యక్తి మద్దతు ఉంటే… పార్టీకి మంచిది అని చంద్రబాబు నాయుడికి బాలయ్యే సూచించారట. పవన్ తో పొత్తు పెట్టుకొంటే నాకెలాంటి అభ్యంతరం లేదు… అని క్లియర్ కట్ గా చెప్పేశారట. బాలయ్య నుంచి వచ్చిన మద్దతు చూసి తెదేపా వర్గాలే ఆశ్చర్యపోతున్నట్టు సమాచారమ్. రాబోయే రోజుల్లో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో బాలయ్య – పవన్ లను ఒకే వేదికపై చూసినా ఆశ్చర్యపోనవసరం లేదని బాలయ్య సన్నిహితులు చెబుతున్నారు. మరి బాలయ్యను, పవన్ నీ పక్క పక్కన చూస్తే సగటు తెలుగు అభిమానికి.. పండగే.