తెదేపాలోకి ఆదాల.. ??

adalaసర్వేపల్లి ఎమ్మెల్యే ఆదాల ప్రభాకరరెడ్డి సైకిల్ ఎక్కనున్నట్లు సమాచారం. మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో.. ఆదాల తెదేపాలో చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే తెదేపా అధినేత చంద్రబాబు తో భేటీ అయి మంతనాలు జరిపినట్లు రాజకీయ వర్గాలో చర్చ జరుగుతోంది. అయితే, ఆదాలతో పాటుగా మరికొందరు మంత్రులు కూడా సైకిల్ ఎక్కడానికి సిద్ధంగా వున్నారని తెలుగు తముళ్లు చెప్పుకుంటున్నారు. కాగా, కొద్ది రోజుల క్రితం జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో ఆదాల రెబల్ అభ్యర్థిగా నామినేషన్ వేసి కాంగ్రెస్, టీఆర్ఎస్ లకు ముచ్చెమటలు పట్టించిన విషయం తెలిసిందే.