సినీ నటుడు , జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చిత్రపటానికి పాలాభిషేకం చేస్తున్నారు. రీసెంట్ గా పవన్ కళ్యాణ్ జనసేన ఆవిర్భావ సభ ను తాడేపల్లి మండలం ఇప్పటం గ్రామంలో జరిపిన సంగతి తెలిసిందే. సభ కు గ్రామస్థులు తమ భూమిని ఇచ్చినందుకు గాను ఇప్పటం గ్రామానికి 50 లక్షలు అందజేశారు.
తమ గ్రామాన్ని రాష్ట్రస్థాయిలో తీసుకువచ్చేందుకు కృషి చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ పవన్ చిత్రపటానికి పాలాభిషేకం చేసారు. గ్రామ అభివృద్ది కోసం పవన్ కళ్యాణ్ చేసిన సాయానికి రుణపడి ఉంటామని ఈ సందర్బంగా తెలియజేశారు.. ఈ కార్యక్రమంలో జనసేన నేతలు.. కార్యకర్తలతోపాటు.. మహిళ కార్యకర్తలు సైతం పాల్గొన్నారు.