జనసేనలో జరుగుతుంది ఇదేనా…!

ఎన్నికలు ముగిశాయి. ఒక్క సీటు గెలిచాం. పార్టీ అధినేతే రెండుచోట్ల ఓటమి పాలయ్యారు. ఎన్నికల ముందు కెరటంలా ఎగిసిన కార్యకర్తల్లో నిశ్శబ్దం ఆవరించింది. ఒకవైపు రాష్ట్రస్థాయి కమిటీలు ఏర్పాటు చేస్తూ స్థానిక సమరానికి సై అంటున్నారు మరోవైపు దిశా నిర్ధేశం చేసే నేతలు లేక కేడర్ లో కన్ ప్యూజన్. ఏం చేయాలో..? ఏం చేయకూడదో..? తెలియని సందిగ్ధావస్థ లో కొట్టుమిట్టాడుతుంది జనసేన కేడర్.

 

అగ్ర నాయకులతో సహా దిగువస్థాయి నేతలెవ్వరూ చురుగ్గా లేకపోవడంతో జన సైన్యం చతికిలపడింది. ఎన్నికల్లో ఓటమి చెందిన అభ్యర్థులు ఆ తరువాత కేడర్‌కు టచ్ లో లేకుండా పోయారు. నియోజకవర్గ స్థాయి ఇన్‌చార్జ్‌లుగా ప్రస్తుతం పోటీ చేసి ఓటమి పొందిన వారే బాధ్యత వహిస్తారంటూ పార్టీ అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ ప్రకటించినా.. క్షేత్రస్థాయిలో మాత్రం కుదుపు లేదు. దిశానిర్ధేశం చేసే నేతలు లేక దిక్కులు చూస్తుంది కింది స్థాయి కేడర్. ఇక నైనా దీని పై పార్టీ అధినేత పవన్ దృష్టిసారిస్తారేమో చూడాలి.