ఆర్థిక సంక్షోభం కారణంగా తిండిగింజల కొరత తలెత్తిన ఆఫ్గాన్‌కు భారత్ ఆపన్నహస్తం అందించింది. భారత్ నుంచి గోధుమల లోడుతో బయలుదేరిన కొన్ని లారీలు నేడు అట్టారీ-వాఘా సరిహద్దు చేరుకున్నాయి. ఈ సరకులు తమ దేశం గుండా వెళ్లేందుకు పాక్ ఎట్టకేలకు అనుమతించడంతో అఫ్గాన్‌కు సహాయం చేసే మార్గం సుగమమైంది. అఫ్గాన్‌కు 50వేల మెట్రిక్ టన్నుల గోధుమలు, ఔషధాలు సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉన్నామని మూడు నెలల కిందటే భారత్ ప్రకటించిన సంగతి తెలిసిందే.