మహిళల టీ20 ప్రపంచకప్‌లో భారత్ 5 పరుగుల తేడాతో ఐర్లాండ్‌ను ఓడించింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు 20 ఓవర్లలో 156 పరుగులు చేసింది. టీమ్ ఇండియా తరుపున స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన 56 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 87 పరుగులతో అర్ధ సెంచరీ చేసింది. ఇక ఐర్లాండ్ 8.2 ఓవర్లలో 2 వికెట్లు నష్టపోయి 54 పరుగులు చేసింది. వర్షం అంతరాయం కలిగించడంతో డక్‌వర్త్ లూయిస్ ప్రకారం విజేతను ప్రకటించారు. అంతేకాదు స్మృతి అద్భుత ఇన్నింగ్స్ కారణంగా భారత్ ప్రపంచ కప్‌లో సెమీఫైనల్‌కు చేరుకుంది. టీ20 మహిళల ప్రపంచకప్‌లో సెమీఫైనల్‌కు చేరిన మూడో జట్టుగా టీమిండియా నిలిచింది.