దేశంలో మాదకద్రవ్యాల చిరునామాను శూన్యస్థాయికి తీసుకురావడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని హోంశాఖ మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. మాదక ద్రవ్యాల అక్రమరవాణా, జాతీయ భద్రత అంశంపై హోం శాఖ ఆధ్వర్యంలో ఢిల్లీలో సమావేశం జరిగింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన హోం శాఖ ఉన్నతాధికారులతో అమిత్ షా సమీక్షించారు. మాదక ద్రవ్యాల రవాణా కట్టడికి తీసుకుంటున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు.