కొవిడ్‌-19 తాజా సమాచారం (23-08-2022)


దేశవ్యాప్త కొవిడ్‌-19 టీకా కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు మొత్తం 210.31 కోట్ల డోసులు ( 94.02 కోట్ల రెండో డోసులు + 14.07 కోట్ల ముందు జాగ్రత్త డోసులు ) అందించారు

గత 24 గంటల్లో 29,25,342 డోసులు అందించారు

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 96,506

మొత్తం కేసుల్లో క్రియాశీల కేసులు 0.22%

ప్రస్తుత రికవరీ రేటు 98.59%

గత 24 గంటల్లో 9,680 మంది కోలుకున్నారు. దీంతో, కోలుకున్నవారి మొత్తం సంఖ్య 4,37,33,624 కు పెరిగింది.

గత 24 గంటల్లో 8,586 కొత్త కేసులు నమోదయ్యాయి.

రోజువారీ పాజిటివిటీ రేటు 2.19%

వారపు పాజిటివిటీ రేటు 3.31%

గత 24 గంటల్లో చేసిన 3,91,281 కొవిడ్‌ పరీక్షలతో కలిపి ఇప్పటివరకు 88.31 కోట్ల పరీక్షలు చేశారు.