దేశంలో భారీగా పెరిగిన కరోనా మరణాలు

దేశంలో కరోనా రెండవ దశ నెమ్మదిగా తగ్గుముఖం పడుతుంది. గత 24 గంటల్లో దేశ వ్యాప్తంగా కొత్తగా 42,015 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు మొత్తం 3,12,16,337 కేసులు నమోదు కాగా, ఇందులో 3,03,90,687 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. 4,07,170 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. తాజా బులెటిన్ ప్రకారం దేశ వ్యాప్తంగా గత 24 గంటల్లో కరోనాతో 3998 మంది మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 4,18,480 కి చేరింది. దేశ వ్యాప్తంగా గత 24 గంటల్లో 36,977 మంది డిశ్చార్జ్ అయ్యారని ప్రకటనలో తెలిపారు.