Site icon TeluguMirchi.com

భారత్ లో 5 వేలకు దగ్గరలో కరోనా కేసులు

కరోనా మహమ్మారి భారత్ లో రోజు రోజుకు విపరీతం అవుతుంది. కరోనా పాజిటివ్ కేసులు అన్ని జిల్లాలో భారీ సంఖ్య లో నమోదు అవుతుండడం తో కేంద్రం లాక్ డౌన్ పెంచే యోచన చేస్తున్నారు. ప్రస్తుతం మన దేశం లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4778 కేసులు నమోదు కాగా 133 మంది మరణించారు.

అత్యధికంగా మహరాష్ట్రలో 868 కేసులు నమోదయ్యాయి. అక్కడ చికిత్స పొందుత 52మంది చనిపోయారు. ఈ తర్వాత స్థానాల్లో తమిళనాడు, ఢిల్లీ, తెలంగాణ ఉన్నాయి. ప్రస్తుతం భారత్ అత్యంత ప్రమాదకరమైన దశల్లో ఉందని ఎయిమ్స్ డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. భారత్‌లో ప్రస్తుతం మూడు, నాలుగు దశలు నడుస్తున్నాయిని తెలిపారు.

కరోనా నియంత్రణకు అనుసరించాల్సిన కంటైన్‌మెంట్‌ విధానంపై ఓరియంటేషన్‌ కం శిక్షణా సెషన్‌ను ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, కలెక్టర్లు, పోలీస్‌ అధికారులతో ఆదివారం సమీక్షించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ లాక్‌డౌన్‌ కంటైన్‌మెంట్‌ విధానాలను పటిష్టంగా అమలు చేయాలన్నారు. జిల్లాలో ర్యాపిడ్‌ రెస్పాన్స్‌ బృందాలు పూర్తిగా అందుబాటులో ఉండి పనిచేసేలా చూడాలని కలెక్టర్లను ఆదేశించారు.

Exit mobile version