నేటినుండి అమలులోకి వచ్చిన భారత్-ఆస్ట్రేలియా వాణిజ్య ఒప్పందం


భారత్-ఆస్ట్రేలియా వాణిజ్య, ఆర్థిక, సహకార ఒప్పందం గురువారం నుంచి అమలులోకి వచ్చింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. అభివృద్ధి చెందిన దేశాలతో భారత్ సమానంగా ముందుకు నడుస్తుందని తెలిపారు. ఆస్ట్రేలియాతో కుదుర్చుకున్న తాజా ఒప్పందం అమలులోకి రావడంతో దేశ ఆర్థిక, వాణిజ్య, సహకార రంగాలు మరింత పురోభివృద్ధి సాధిస్తాయని పేర్కొన్నారు. అదేవిధంగా ఇరుదేశాల ద్వైపాక్షిక అంశాలు మరింత బలోపేతం అవుతాయని తెలిపారు.