ఏపీలో కానిస్టేబుల్ రాతపరీక్షకు ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. రేపు ఉదయం 9 గంటల నుంచి పరీక్షా కేంద్రాల్లోకి ఎంట్రీ ఉంటుంది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకూ పరీక్ష జరగనుంది. 6100 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఏపీ కానిస్టేబుల్ పరీక్ష కు సంబంధించి ముఖ్యమైన సూచనలు చేశారు.
ఏపీలో 6,100 కానిస్టేబుల్ పోస్టులకు ఆదివారం ప్రిలిమినరీ పరీక్ష ఉ.10 గంటల నుంచి మ. 1 వరకు జరుగుతుంది. ఉదయం 9 గంటలకే పరీక్షా కేంద్రాల్లోకి వెళ్లవచ్చు. ఉదయం 10 గం. తర్వాత ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చినా అనుమతించబోమని అధికారులు స్పష్టం చేశారు. అభ్యర్థులు మొబైల్, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు, వాలెట్,నోట్స్ వంటి వాటికి నో ఎంట్రీ. అభ్యర్థులు తమ హాల్ టికెట్, పెన్, ఆధార్ కార్డు/రేషన్ కార్డు లాంటి గుర్తింపు కార్డు కచ్చితంగా తీసుకురావాలి. పరీక్ష రాసేందుకు బ్లూ/బ్లాక్ పాయింట్ ని మాత్రమే వాడాలి. ఇవ్వబడిన నిర్దిష్ట సమయంలో 200 ప్రశ్నలకు సమాధానం రాయాలి. అభ్యర్థి సమయపాలన పాటించాలి. లేకుంటే అన్ని ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం కష్టం. అన్ని ప్రశ్నలకు సమానమైన మార్కులను రిక్రూట్మెంట్ బోర్డు వారు కేటాయించారు.