ఇక ‘తెలంగాణ భవన్’లోనే మకాం!

kcrటీఆర్ ఎస్ అధినేట కేసీఆర్ శపథం చేశారు. ఇక నుంచి ఫామ్ హౌస్ కి వెల్లేదిలేదని, ప్రతిరోజు తెలంగాణ భవన్ కి వస్తానన్ని స్పష్టం చేశారు. భోజనం కూడా ఇక్కడికే తెప్పించుకుంటున్నానని ఆయన తెలిపారు. బుధవారం మధ్యాహ్నం ఫామ్ హౌస్ నుంచి నేరుగా తెలంగాణ భవన్ కు చేరుకున్న కేసీఆర్ పార్టీ సీనియర్ నేతలు ఈటెల రాజేందర్, పోచారం శ్రీనివాస్ రెడ్డి, కెటీఆర్, నాయిని నరసింహారెడ్డి, జి.జగదీశ్ రెడ్డి, కర్నె ప్రభాకర్, డి.శ్రవణ్ కుమార్, బొంతు రామ్మోహన్ తదితరులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీతో పొత్తు పెట్టుకునేది లేదన్నారు. అంతేకాకుండా ఏ పార్టీలోను టీఆర్ ఎస్ ను విలీనం చేసే ప్రసక్తే లేదన్నారు. అయితే 2004 ఎన్నికలకంటే ముందు ఎలా హల్ చల్ చేశామో, ఇప్పుడూ అదేరకంగా పార్టీ శ్రేణులను కదిలించాలని నేతలకు ఆయన పిలుపునిచ్చారు.

స్థానిక సంస్థలు, సాధారణ ఎన్నికల హడావుడి మొదలైతే.. గ్రేటర్ హైదరాబాద్ పూర్తి స్థాయిలో దృష్టి పెట్టడం, ఇతర ప్రాంతాల నేతలతో పార్టీ పటిష్ఠత కోసం చర్యలు చేపట్టడం సాధ్యం కాదని, ఆలోపే నగరంలో ‘గడప గడపకు పార్టీ’ని తీసుకెళ్లాలని సూచించారు. ఈనెల 30న పార్టీ పొలిట్ బ్యూరో సమావేశం నిర్వహించాలనుకుంటున్నారు కేసీఆర్. కాగా, స్థానిక సంస్థలకు ఎన్నికలు జూన్ లో ఉండవచ్చునని.. అందువల్ల ఏప్రిల్ రెండో వారం నుంచి నియోజకవర్గాలు, మండలాలవారీగా కార్యక్రమాలు చేపట్టనున్నట్లు కెసిఆర్ తెలిపారు.