వై. ఎస్. రాజశేఖర రెడ్డి నిలువెత్తు అవినీతికి చిరునామాగా నిలిచిన జలయజ్ఞం శంకుస్థాపన రాళ్ళను చూసేందుకు ఆయన సతీమణి విజయలక్ష్మి వెళ్ళటం అత్యంత హేయమని తెలుగుమహిళ అధ్యక్షురాలు శోభా హైమవతి ఎద్దేవా చేసారు. వై. ఎస్. శంకుస్థాపన చేసిన పధకాల రాళ్ళన్నిమొండిరాళ్ళు గా మిగిలాయనీ, ఆయన ప్రారంభించిన పదకాలన్నీ ఆయన కుటుంబానికి తప్ప రాష్ట్ర ప్రజలకు ఏ మాత్రం
ఉపయోగపడలేదని ఆమె ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ” ప్రాణహిత- చేవెళ్ళ
పధకానికి పాలాభిషేకం చేసిన విజయమ్మ తన భర్త ఏదో ఘనకార్యం చేసినట్టు చెప్పుకుంటున్నారు. మరి ఇప్పటివరకు ఆ ప్రాజెక్టును పూర్తి చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని ఎందుకు కోరలేదు? తన కొడుకు బెయిల్ కోసం ఇన్నిసార్లు డిల్లి చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్న ఆమె ఈ ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా గుర్తించి పూర్తి చేయాలంటూ
కేంద్ర ప్రభుత్వాన్ని ఎందుకు అడగలేదు ? ” అని హైమవతి విరుచుకు పడ్డారు.