Site icon TeluguMirchi.com

సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం , రంగనాథ్ కీలక వ్యాఖ్యలు..


హైడ్రా కమిషనర్ రంగనాథ్ ప్రజల ఆస్తులను కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందని స్పష్టం చేశారు. చెరువులు, నాలాలు, నదులు కాపాడడం హైడ్రా లక్ష్యం అని ఆయన చెప్పారు. ఆర్టికల్ 21 ప్రకారం, పరిశుభ్రమైన వాతావరణం మన హక్కు. ఈ నేపథ్యంలో, హైడ్రా డిజాస్టర్ మేనేజ్‌మెంట్ మరియు ఎసెట్ ప్రొటెస్ట్ వంటి అంశాలు అత్యంత ముఖ్యమైనవి. మేము హైడ్రా ను రక్షించడం మా బాధ్యతగా భావిస్తున్నాము. అయితే, ప్రస్తుతానికి సోషల్ మీడియాలో హైడ్రాపై వ్యతిరేక వార్తలు తేలికగా వస్తున్నాయి. కొంతమంది బలవంతులు అక్రమ కట్టడాల వెనుక ఉన్నారని అన్నారు. అనధికార ఆస్తులను కూల్చినట్లు, ఇప్పటి వరకు 21, 22 ప్రాంతాల్లో కూల్చివేతలు జరిపినట్లు తెలిపారు. దుండిగల్ మరియు అమీన్‌పూర్ ప్రాంతాల్లో నకిలీ పర్మిషన్లు ఇచ్చిన వారిపై కేసులు నమోదుచేయడం జరిగిందని, పంచాయతీ సెక్రటరీని సస్పెండ్ చేసినట్లు వెల్లడించారు. ఎక్కడా హాస్పిటల్‌ను హైడ్రా కూల్చలేదని స్పష్టం చేశారు. కొంతమంది సరైన విచారణ చేయకుండా ఆస్తులు కొనుగోలు చేస్తున్నారు. పంచాయతీ పర్మిషన్లు క్యాన్సిల్ అయిన తర్వాత కూడా నిర్మాణాలు చేపట్టడాన్ని కరెక్ట్ చేయడం అవసరం అన్నారు. తప్పులు చేసిన బిల్డర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తున్నామని వెల్లడించారు.

సున్నం చెరువులో వెంకటేష్ అనే వ్యక్తి కిరోసిన్ పోసుకుని ట్యాంకర్ల బిజినెస్ నిర్వహిస్తున్నాడని, ఆయన ఆదాయం రోజుకు లక్షకు పైగా ఉంటుందని చెప్పారు. FTLలో ప్రజలు నివాసం ఉండే సముదాయాలకు వెళ్లడం లేదు. కూల్చివేతలకు సంబంధించి సంబంధిత ఇంటి యజమానులకు మేము సమాచారం అందిస్తున్నాము.బుచ్చమ్మ ఆత్మహత్య వెనుక వేరే కారణం ఉందని అనుకుంటున్నారు. హైడ్రా అనేది ఒక భరోసా, కాబట్టి దయచేసి దీన్ని భూచి లేదా రాక్షసంగా చూపించొద్దు. దేశంలో ఎక్కడా హైడ్రా వంటి వ్యవస్థ లేదు. హైడ్రా అంటే భాద్యత మరియు భరోసా.

“పర్మిషన్ ఉందని చెబుతున్నారు” అనే మాటలు నిజంగా తప్పు. ఒకవేళ పర్మిషన్ చూపించినా, అవన్నీ చెల్లవు, ఎందుకంటే అవి సమయం ముగిసిపోయి చాలా కాలం అయింది. చాలా కాలేజీలపై ఫిర్యాదులు వచ్చాయి, కానీ అకడమిక్ ఇయర్ మధ్యలో ఉంది. విద్యా సంవత్సరం ముగిసిన తర్వాత వాటిని పరిశీలిస్తామని తెలియజేస్తున్నాము. సమస్యలను సమర్థంగా పరిష్కరించడం, కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదు, ప్రతి ఒక్కరి బాధ్యత. అందుకే, హైడ్రా వ్యవస్థను మంచి దృష్టితో, బాధ్యతగా చూడాలి అని అన్నారు.

Exit mobile version