Site icon TeluguMirchi.com

వరద ప్రభావిత ప్రాంతాల్లో స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ చేపట్టిన జిహెచ్ఎంసి

నగరంలోని చెరువుల రక్షణకు, సుందరీకరణకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తున్నట్లు జిహెచ్ఎంసి మేయర్ బొంతు రామ్మోహన్ తెలిపారు. సోమవారం జూబ్లీహిల్స్ షేక్ పేట్ లోని కొత్త చెరువులో పెరిగిన గుర్రపుడెక్క, చెత్తాచెదారాన్ని తొలగించే పనులతో పాటు దోమల వ్యాప్తిని అరికట్టేందుకు చేపట్టిన యాంటి లార్వా స్ప్రేయింగ్, ఫాగింగ్ పనులను ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ….మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు ఇళ్లలో నిరుపయోగంగా ఉన్న వస్తువులు, పాడైపోయిన పరుపులు, ఫర్నీచర్ ను నాలాలు, చెరువులలో వేయడం వలన కలుషితం కావడంతో దోమలు పెరిగి చుట్టుపక్కల వారికి అంటు రోగాలు సోకే అవకాశం ఉందని పేర్కొన్నారు. రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కె.తారకరామారావు ఆదేశాల మేరకు నగర పరిధిలోని 185 చెరువులను దశల వారిగా పటిష్టపర్చనున్నట్లు తెలిపారు. అదేవిధంగా దోమల వ్యాప్తిని అరికట్టేందుకు, చెరువుల సుందరీకరణ కై నగరంలోని 39 చెరువులలో పేరుకుపోయిన గుర్రపుడెక్కను యంత్రాలతో తొలగిస్తున్నట్లు తెలిపారు. అలాగే దోమల వ్యాప్తిని అరికట్టేందుకై  డ్రోన్ ల ద్వారా చెరువులు, దాని పరిసరాలలో యాంటి లార్వా స్ప్రేయింగ్ చేయిస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా పరిసరాలలో సోడియం హైపో క్లోరైట్ క్రిమీసంహారకాలను స్ప్రే చేయిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కె.తారకరామారావు ఆదేశాల మేరకు వరద ముంపు ప్రాంతాల్లో అంటువ్యాదులను అరికట్టేందుకు  ఎంటమాలజి విభాగంచే యాంటీ లార్వా, సోడియం హైపో క్లోరైట్ క్రిమి సంహారకాల స్ప్రేయింగ్  ఇంటెన్సివ్ డ్రైవ్ చేపట్టినట్లు నగర మేయర్ బొంతు రామ్మోహన్ ఒక ప్రకటనలో తెలిపారు. 

235 కాలనీలు, 39 చెరువులతో పాటు మూసిలో యాంటీ లార్వా, క్రిమి సంహారకాల స్ప్రేయింగ్ చేయిస్తున్నట్లు తెలిపారు. 125 టీమ్స్ ద్వారా నీటి నిల్వ ప్రాంతాలు, నాలలలో   యాంటీ మలేరియా స్ప్రేయింగ్ చేస్తున్నట్లు తెలిపారు. వరద నీటిని తొలగించిన 252 ప్రాంతాలు,  నీటిని తొలగించిన 65 వేల ఇండ్లలోపల, పరిసరాలలో క్రిమి సంహారకాలు స్ప్రే చేశారు.   ఇప్పటివరకు  50 వేల లీటర్ల సోడియం హైపో క్లోరైట్ ద్రావణాన్ని స్ప్రే చేయించినట్లు తెలిపారు. 2.2 లక్షల గంబూషియా చేప పిల్లలను, 6 వేల  ఆయిల్ బాల్స్ ను నాలాలు, కాలువలు, చెరువు లలో వదిలారు. 54 మంది సిబ్బందితో కూడిన 4 బృందాలచే మూసి నదిలోపల, దాని చుట్టు పక్కల యాంటీ లార్వా, క్రిమి సంహారకాల స్ప్రేయింగ్ చేస్తున్నారు.చెరువులలో స్ప్రేయింగ్ కు  10 డ్రోన్ల ను వినియోగిస్తున్నారు. నిర్దేశిత 39 చెరువులలో ఇప్పటి వరకు 17 చెరువులలో స్ప్రేయింగ్ పూర్తయింది. మరో వారంలో అన్ని చెరువుల్లో స్ప్రేయింగ్ పూర్తవుతుంది.ఖాళీ ప్లాట్ల లో కూడా   టెంపో స్ప్రే చెయడం జరిగినది. 350 మంది సిబ్బంది ని  ఫాగింగ్ ఆపరేషన్స్ కు కేటాయించడం  జరిగింది .అన్ని ప్రాంతాల్లోనూ ఫాగింగ్ చేయడం జరుగుతున్నది. 842 స్నాప్ సాక్ స్ప్రేయర్స్, 10OO పవర్ స్ప్రేయర్లు, 64 పెద్ద ఫాగింగ్ మిషన్లు, 305 చిన్న ఫాగింగ్ మిషన్లు ఉపయోగిస్తున్నారు. యాంటీ లార్వా, ఇతర కెమికల్స్ నిల్వలు సమృద్ధిగా అందుబాటులో ఉంచడం జరిగింది  అలాగే ఎంతమాలజి సిబ్బంది వరద ప్రభావిత ప్రాంతాల్లో ఇంటింటికి తిరిగి కరపత్రాలు, స్టిక్కర్లు పంపిణీచేసి .డెంగ్యూ,  మలేరియ  , చికెన్ గున్యా, ఫైలేరియా  , మెదడు వాపు, కొవిడ్  ల నివారణకై తీసుకోలాల్సిన జాగ్రత్తలు  గురించి  అవగాహన కలగచేస్తున్నట్లు మేయర్ బొంతు రామ్మోహన్ తెలిపారు. మలేరియా నివారణ కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని ప్రజలకు విజ్ఞ‌ప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ మహ్మద్ రషీద్ ఫరాజుద్దీన్, చీఫ్ ఎంటమాలజిస్ట్ డా.రాంబాబు, సీనియర్ ఎంటమాలజిస్ట్ లక్ష్మయ్య, ఏ.ఎం.ఓ.హెచ్ డా.రవికాంత్, అసిస్టెంట్ ఎంటమాలజిస్ట్ రజిత తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version