Site icon TeluguMirchi.com

రోడ్ల మరమ్మతు, పునరుద్దరణ పనులు చేపట్టిన జిహెచ్ఎంసి

ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలతో నగరంలో దెబ్బతిన్న రోడ్ల మరమ్మతులు, పునరుద్దరణ పనులను చేపట్టినట్లు జిహెచ్ఎంసి చీఫ్ ఇంజనీర్ జియాఉద్దీన్ తెలిపారు. రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కె.తారకరామారావు ఇటీవల నిర్వహించిన సమావేశంలో జారీచేసిన ఆదేశాలకు అనుగుణంగా యుద్దప్రాతిపదికన రోడ్ల మరమ్మతు పనులు కొనసాగిస్తున్నట్లు తెలిపారు. నగరంలో సాధారణ స్థితిని పునరుద్దరించుటకు ప్రత్యేక శ్రద్ద తీసుకుంటున్నట్లు తెలిపారు.

Exit mobile version