భయం గుప్పిట్లో హైదరాబాద్ వాసులు

తెలంగాణ రాష్ర్టాన్ని భారీ వ‌ర్షాలు ముంచెత్తుతున్నాయి. ఎడ‌తెరిపి లేకుండా కుండ‌పోత వాన కురుస్తోంది. ఈ క్ర‌మంలో హైద‌రాబాద్ వాతావ‌ర‌ణ శాఖ రెడ్ అల‌ర్ట్ జారీ చేసింది. రాష్ర్ట వ్యాప్తంగా లోత‌ట్టు ప్రాంతాల ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని అధికారులు హెచ్చ‌రిస్తున్నారు.

ఇక హైదరాబాద్ విషయానికి వస్తే ప‌లు ప్రాంతాల్లోకి భారీగా వ‌ర‌ద‌నీరు చేరింది. దీంతో.. వారిని సుర‌క్షిత ప్రాంతాల‌కు త‌ర‌లిస్తున్నారు అధికారులు.. ఎడ‌తెరిపి లేకుండా కురుస్తున్న వ‌ర్షంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.. ఇక‌, మ‌రో రెండు రోజులు కూడా ఈ త‌ర‌హాలోనే వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉండ‌డంతో.. జీహెచ్ఎంసీ అధికారులు ప్ర‌జ‌ల‌ను అప్ర‌మ‌త్తం చేస్తున్నారు.. శిథిలావ‌స్థ‌కు చేరిన భ‌వ‌నాల్లో నివ‌సిస్తున్న కుటుంబాలు వెంట‌నే ఖాళీ చేయాలని విజ్ఞ‌ప్తి చేశారు.

మరోపక్క వరద ప్రవాహం వచ్చి చేరడంతో హుస్సేన్‌సాగర్, హిమాయత్‌ సాగర్ ప్రమాదకరంగా మారింది. హుస్సేన్ సాగర్ గరిష్టనీటిమట్టానికి చేరింది. దీంతో జీహెచ్‌ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. అటు పోలీసులు కూడా అలెర్ట్ అయ్యారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశామని సీపీ అంజనీకుమార్ తెలిపారు. ప్రజలు అత్యవసర పరిస్థితుల్లోనే బయటికి రావాలని సీపీ అంజనీకుమార్ సూచించారు.