తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా హుజురాబాద్ రాజకీయం నడుస్తుంది. ఈటెల రాజీనామా తో ఇక్కడ ఉప ఎన్నికలు జరగబోతున్నాయి. రెండు, మూడ్రోజుల్లో ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదలకు ఈసీ ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పుడే ఉప ఎన్నికకు సిద్ధంగా లేమని సీఈసీకి కేసీఆర్ సర్కార్ లేఖ రాసింది. దేశవ్యాప్తంగా ఉప ఎన్నికలు నిర్వహించేందుకు ఈసీ ఏర్పాట్లు చేస్తోంది. వచ్చే నెలలో 103 ఎమ్మెల్యే స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించే యోచనలో ఈసీ ఉంది. కేంద్రం నుంచి సంకేతాలు రావడంతో టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ అలెర్ట్ అయ్యాయి.