ర‌మేష్ హాస్పటల్ కు ప‌ర్మిష‌న్ రద్దు చేసిన ఏపీ ప్రభుత్వం ..

విజయవాడలోని కోవిడ్ కేర్ సెంటర్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఏలూరు రోడ్డులోని రమేష్‌ ఆసుపత్రి కొవిడ్‌కేర్‌ సెంటర్‌గా వినియోగిస్తున్న హోటల్‌ స్వర్ణ ప్యాలస్‌లో ఈ ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 11 మంది మృతి చెందారు. చాలామందికి గాయాలు కావడం తో వారికీ చికిత్స అందిస్తున్నారు.

ఈ ప్రమాదంలో మృతి చెందినవారి కుటుంబాలకు ఏపీ సీఎం వైఎస్ జగన్ రూ. 50 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. ఈ ఘటన పట్ల ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. ఈ ఘటనపై విచారణ అనంతరం రూల్స్‌కు వ్యతిరేకంగా కోవిడ్ కేర్ సెంటర్‌ను పెట్టడ‌మే కాకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోలేదని గుర్తించారు. అంతే కాకుండా దాంతో ర‌మేష్ ఆస్ప‌త్రికి ప‌ర్మిష‌న్ ఇచ్చిన‌ కోవిడ్ కేర్ సెంటర్లను జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ రద్దు చేశారు.