తెలంగాణ : ఆదిలాబాద్ జిల్లాలో గుడిహత్నూర్ చెందిన ఆర్యన్ మహారాజ్ అనే వ్యక్తి చెట్టును కొట్టేయడం ఇష్టం లేక తన ఇంటి డిజైన్నే మార్చేసుకున్నారు. ఆర్యన్ కొన్ని నెలల క్రితం ఇంటి నిర్మాణాన్ని చేపట్టారు, ఆ స్థలంలోని ఓ ఇప్ప చెట్టు సరిగ్గా ఇంటి మధ్యలోకి వస్తుండటంతో ఇంటి ఆకృతిని మార్పు చేయించుకున్నారు. చెట్టును అలాగే ఉంచి మిద్దెపైకి వెళ్లేందుకు వీలుగా ఓ చిన్నగదిని నిర్మించుకున్నారు. కాంక్రీటు, సిమెంటు వల్ల చెట్టు ఎదగదన్న ఉద్దేశంతో వెదురుబొంగులు, చెక్కలు, పెంకులతో గది పైకప్పును ఏర్పాటు చేశారు.