నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం తన 101వ చిత్ర పనుల్లో బిజీగా ఉన్నాడు. పూరీ జగన్నాథ్ తెరకెక్కిస్తున్న ఈ చిత్ర షూటింగ్ హైద్రాబాద్లో జరుగుతుండగా బాలయ్యబాబు చాలా బిజీ అయ్యాడు. వేసవి కాలం రావడంతో బాలయ్య నియోజక వర్గం హిందూపురంలో మంచి నీటి సమస్య తీవ్రంగా మారింది. తాగు నీరు లేక జనాలు అల్లాడిపోతున్నారు. హిందూపురం తాగునీటి సమస్యల గురించి రోజు వార్తల్లో వస్తున్న కూడా ఎమ్మెల్యే బాలయ్య ఒక్కసారి కూడా స్పందించలేదు. దాంతో ప్రజలకు చిర్రెత్తిందో ఏమో కానీ బాలయ్య మీద ఉన్న కోపాన్ని మాత్రం గట్టిగానే తీర్చుకున్నారు. తాగునీటి కోసం జనం నానా ఇబ్బందులు పడుతున్నా కూడా ఎమ్మెల్యే ఒక్కసారి కూడా స్పందించకపోవడంపై తీవ్ర నిరసనలు వ్యక్తం చేశారు.
ప్రజలంతా కూడా మంచినీటి బిందెలు పట్టుకుని సమయం లేదు మిత్రమా అంటూ ప్లకార్డులు పట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. మరికొంత మంది అయితే ఏకంగా దున్నపోతుల మీద బాలకృష్ణ ఎమ్మెల్యే అని రాసి బాలయ్యను ఘోరంగా అవమానించారు. ప్రజలు ఇంతలా ఇబ్బందులు పడుతున్నా కూడా ప్రజానేత అయి స్పందించకపోవడంతో జనాలు ఆగ్రహానికి లోనయ్యి బాలయ్యపై కోపాన్ని ఇలా తీర్చుకున్నారు కాబోలు. అందుకే దున్నపోతుల మీద బాలయ్య పేరు రాశారు. ఈ విషయం తెలుసుకున్నబాలయ్య చాలా ఫీల్ అవుతున్నాడు. ఇదేదో ముందు ఆలోచిస్తే ఇంత దారుణ పరిస్థితి ఏర్పడకపోవు కదా!