పవన్ స్పీచ్ హైలెట్స్

p1పవన్ కళ్యాణ్ తన పార్టీ పేరు జన సేన అని అధికారికంగా ప్రకటించారు. ఆవిర్భావ సభలో ఆయనసుదీర్గంగా ప్రసంగించారు. తాను సమాజం, దేశహితం కోరుకునేవాడినని తనకు ఈ సీఎం , మంత్రిపదవులు గడ్డిపోచతో సమానమని అన్నారు. ప్రాంతం పేరిట ప్రజలను వేరుచేస్తే సహించబోనన్నారు.

పవన్ స్పీచ్ లో మరిన్ని హైలెట్స్ :

*నాకు ఏమీ లేకున్నా గుండె నిండా ధైర్యం.

*పార్టీ ఆవిర్భావానికి కారణం ఢిల్లీ పెద్దల ముందు రాష్ట్ర నాయకుల బానిస బ్రతుకులే

*సమాజంలో జరిగే అన్యాయం, అక్రమాలు భరించలేక ఇప్పుడు కొత్త పార్టీ పెట్టా.

* పార్టీ పెట్టేముందు తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలన్న కల్వకుంట్ల కవితకు పవన్ కౌంటర్ . ‘అసలు ఇది నా తెలంగాణ, క్షమాపణ చెప్పమని అడగడానికి మీరెవరు?’

* పార్టీకి సైద్ధాంతిక బలముందని, ఈ నేపథ్యంలో కొందరు రాజకీయ శత్రువులు ఏర్పడే అవకాశముందని,తనను చంపినా చంపొచ్చని , కానీ, చావడానికైనా సిద్ధమే కానీ, పిరికితనంతో వెనకడుగు వేయబోను.

*
తాను తెలంగాణకు వ్యతిరేకం కాదని, అయితే సీమాంధ్రుల ఆత్మ గౌరవం, ముఖ్యంగా తెలుగుజాతి ఆత్మగౌరవం దెబ్బతింటుంటే చూస్తూ ఊరుకొను.

* వేలమంది అభిమానాన్ని తాకట్టుపెట్టి పైకెదగాలని తాను కోరుకోవడంలేదు.

* కాంగ్రెస్ తో తప్ప ఏ పార్టీతోనైనాకలుస్తా

* కాంగ్రెస్ ను ఖేల్ ఖతమ్ చేయడమే ప్రధాన ప్రాతిపాదిక.

* ‘కాంగ్రెస్ హఠావో… దేశ్ భచావో.. ఈ స్లోగన్ తో పవన్ ప్రశంగం ముగిసింది.