దేశ వ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీలు హైదరాబాద్ గ్రేటర్ ఎన్నికలపై ఫోకస్ పెట్టాయి. గ్రేటర్ ఎన్నికల్లో ప్రజలు ఎవరికీ పట్టం కట్టపెడతారా అని ఎదురుచూస్తున్నారు. మంగళవారం జీహెచ్‌ఎంసీ ఎన్నికల పోలింగ్ మొదలైంది.ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకూ సాగనుంది. ఇప్పటికే పలువురు సినీ రాజకీయ ప్రముఖులు, పోలీసు ఉన్నతాధికారులు ఉదయాన్నే పోలింగ్ కేంద్రాలకు చేరుకుని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే పోలీసులు పాతబస్తీ ప్రాంతం ఫై ప్రత్యేక నిఘా పెట్టారు.
పాతబస్తీలో మొత్తం 590 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఉండగా, అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు 387 ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరింపజేశారు. 70వేల సీసీకెమెరాలతో నిఘాను ఏర్పాటు చేసారు. స్పెషల్ ట్రాకింగ్ టీమ్, రూట్ మొబైల్ టీమ్ లను కూడా ఈ ప్రాంతంలో ఏర్పాటు చేశారు. గత ఎన్నికల్లో జరిగిన ఘటనలను దృష్టిలో పెట్టుకొని భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.