వైఎస్ ఉంటే విజయనిర్మలకు పద్మభూషణ్ దక్కేదన్నారు సూపర్ స్టార్ కృష్ణ. మేం నోరు తెరిచి ఎప్పుడు ఏది అడగకున్నా నా సినీరంగ కృషిని గుర్తుపెట్టుకొని సీఎంగా ఉన్నప్పుడు వైఎస్ తనను ఎంతో గౌరవించారన్నారు. ఆయనే తనకు తానుగా నాకు ‘పద్మభూషణ్’ ఇప్పించారు అని ఒక మీడియాకిచ్చిన ఇంటర్యూలో వైఎస్ తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు హీరో కృష్ణ . గిన్నిస్ రికార్డ్ హోల్డర్ డైరెక్టర్గా పేరు తెచ్చుకున్న విజయనిర్మలకు రఘుపతి వెంకయ్యనాయుడు అవార్డు దక్కిందన్నారు.
నాకు అవార్డు వచ్చిన ఒకటి,రెండేళ్ల తర్వాత నిర్మలకు కూడా ‘పద్మభూషణ్’ ఇప్పిస్తానన్నారు. కానీ, అంతలోనే ఆయన మరణించారు. ఆ తరువాత ఆమెకు అది దక్కలేదు. మేమెప్పుడు అవార్డులకోసం ఆరటపడలేదన్న కృష్ణ అవే తమను వెతుక్కుంటూ వచ్చాయన్నారు. మాకు ప్రజల్లో ఉన్న ఆదరణ కన్నా ఇంకేం అవసరం లేదన్నారు.