తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత వారం రోజులుగా వర్షాలు దంచికొడుతున్నాయి. భారీ నుంచి అతిభారీ వర్షాలు అక్కడక్కడా కురుస్తున్నాయి. ఫలితంగా రోడ్లన్నీ జలమయం అయ్యాయి. రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. హైదరాబాద్‌లో కూడా ఉన్నట్టుండి భారీ వర్షం కురుస్తోంది. దాంతో నగర ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.
ప్రభుత్వం విడుదల చేసిన మ్యాప్స్ ప్రకారం ఉత్తర తెలంగాణలో అతి భారీ వర్షాలు పడనున్నాయి. ముఖ్యంగా ఆదిలాబాద్, నిర్మల్, సిద్ధిపేట, మెదక్, సంగారెడ్డి, నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాలలో అతి భారీ వర్ష సూచన ఉంది. అలాగే తూర్పున ములుగు జిల్లా, కొమరంభీమ్ జిల్లాలో అతి భారీ వర్షాలు కురవనున్నాయి. ఈ నేపథ్యంలో అధికారులు అలర్ట్ అయ్యారు.