Site icon TeluguMirchi.com

14 ఏళ్ల తర్వాత హరీష్‌తో మాట్లాడిన జగ్గారెడ్డి

ఒకప్పుడు కలిసి పని చేసిన హరీష్‌ రావు మరియు జగ్గారెడ్డిలు రాజకీయ కారణాల వల్ల తీవ్ర స్థాయిలో ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్న విషయం తెల్సిందే. ఇద్దరు కూడా ఒకానొక సమయంలో నువ్వా నేనా అన్నట్లుగా ఢీ కొట్టారు. కాని ఇప్పుడు పరిస్థితి మారింది. హరీష్‌ రావు ప్రస్తుతం మంత్రిగా ఉన్నాడు. జగ్గారెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నాడు. అందుకే మంత్రి అవసరం పడటంతో జగ్గారెడ్డి నేడు హరీష్‌ రావును కలవడం జరిగింది. దాదాపు 14 సంవత్సరాలుగా వీరిద్దరి మద్య మాటలు లేవని, ఇన్నాళ్లకు వీరిద్దరు మాట్లాడుకున్నారు అంటూ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

కాంగ్రెస్‌ ఎమ్మెల్యే అయిన జగ్గారెడ్డి తన నియోజక వర్గం అభివృద్ది కోసం సహకరించాలని, నియోజక అభివృద్దికి ఆర్థిక సాయం చేయాలంటూ కోరడం జరిగింది. అందుకు హరీష్‌రావు సానుకూలంగా స్పందించడంతో పాటు జగ్గారెడ్డితో ఆప్యాయంగా మాట్లాడినట్లుగా సమాచారం అందుతోంది. ఆమద్య జగ్గారెడ్డి టీఆర్‌ఎస్‌లో జాయిన్‌ అయ్యే అవకాశం ఉందని ప్రచారం జరిగింది. తాజాగా ఈ అరగంట భేటీతో ఆ వార్తలు మళ్లీ మొదటికి వచ్చాయి. జగ్గారెడ్డి మాత్రం నియోజక వర్గం అభివృద్ది విషయమై మాట్లాడినట్లుగా చెప్పుకొచ్చాడు.

Exit mobile version