సూర్యాపేట జిల్లా మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం రేపింది. నిన్న మెడికల్ కాలేజీలో సీనియర్లు, ఓ జూనియర్ విద్యార్థిని ర్యాగింగ్ చేసిన గటన కలకలం రేపింది. జూనియర్ విద్యార్థి దుస్తులు విప్పించి ఫోటోలు తీసి ర్యాగింగ్ చేశారు. దీంతో సదరు విద్యార్థి ఈ విషయాన్ని తన తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడంతో.. వారు హైదరాబాద్ నుంచి డయల్ 100కి ఫోన్ చేశారు. దీంతో అక్కడికి చేరుకుని సీనియర్ల నుంచి విద్యార్థిని రక్షించిన పోలీసులు కొంతమంది సీనియర్ విద్యార్ధులపై కేసు నమోదు చేసి వారిని విచారిస్తున్నారు.
ఈ ఘటనపై రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు స్పందిస్తూ… సూర్యాపేట మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ అంశం ప్రభుత్వం దృష్టికి వచ్చింది. ర్యాగింగ్ నిషేధమని, రాబోయే రోజుల్లో ఇలాంటి ఘటనలు చోటుచేసుకోకుండా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ ఘటనపై కమిటీ ఏర్పాటు చేసి, విచారణ జరుపుతున్నామని తెలిపారు. ర్యాగింగ్ జరిగిందా? లేదా? అనేది కమిటీ విచారణలో తేలనుంది. ర్యాగింగ్ జరిగినట్లు తేలితే కఠిన చర్యలు తీకుంటామని హరీశ్‌రావు స్పష్టం చేశారు.