Site icon TeluguMirchi.com

రాయల తెలంగాణ ఒప్పుకోం: హరీష్ రావు

trs harish raoరాయల తెలంగాణపై జీవోఎం ఇంకా అధికార ప్రకటన చేయక ముందే ఈ ప్రతిపాదన పై తీవ్ర నిరశన వస్తున్నాయి. ఈ క్రమంలో… రాయల తెలంగాణకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోమని టీఆర్ఎస్ నేత హరీష్ రావు తెలిపారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ లో టీఆర్ఎస్ కార్యకర్తల శిక్షణా శిబిరంలో ఆయన మాట్లాడుతూ… 10 జిల్లాల తెలంగాణే తమకు కావాలన్నారు. సీడబ్ల్యూసీ తీర్మానం చేసిన విధంగా 10 జిల్లాల తెలంగాణను ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణలోని ఏ పక్షమూ రాయల తెలంగాణకు అంగీకరించేందుకు సిద్ధంగా లేదని తెలిపారు.

Exit mobile version