ఇల్లు అలకగానే పండుగ కాదు !

T-Harish-Raoతెలంగాణ విషయంలో గతంలో చోటుచేసుకున్న పరిణామాల దృష్ట్యా కాంగ్రెస్ వ్యూహాల పట్ల అప్రమత్తంగానే ఉండాలని తెరాస సీనియర్ నేత హారీష్ రావు అన్నారు. తెలంగాణ భవన్ లో హరీష్ విలేకరులతో మాట్లాడుతూ… ఇల్లు అలకగానే పండగ కాదని.. తెలంగాణపై ప్రకటన చేసినంత మాత్రన నమ్మే ప్రసక్తి లేదని, పార్లమెంటులో బిల్లు పాస్ అయితేనే తాము సంబరాలు జరుపుకుంటామని అన్నారు. ఈ రోజు సాయంత్రం కేంద్రం చేసే ప్రకటనపై వేచిచూసే ధోరణి అవలంబిస్తామని.. ఎందుకంటే, డిసెంబర్ 9 ప్రకటన తదనంతర పరిణామాల నేపథ్యంలో ఆచితూచి స్పందిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఒకవేళ కేంద్రం తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటే.. స్వాగతిస్తామని హరీష్ అన్నారు. అయితే, పార్లమెంట్ లో తెలంగాణ బిల్లు పెట్టేవరకు పోరాటం ఆపబోమని ఆయన స్పష్టం చేశారు.