సి.ఎమ్.రేసులో ఉన్న నేతలందరు ఓడిపోతారట !

harish reao
ముఖ్యమంత్రి పదవి రేసులో టీకాంగ్రెస్ నేతలందరూ కాంగ్ ఉన్న నేతలంతాఓటమిపాలౌరని టిఆర్ఎస్ నేత టి.హరీష్ రావు జోస్యం చెబుతున్నారు తెలంగాణ రాష్ట్ర సమితి స్వతంత్రంగానే అధికారంలోకి వస్తుందని ఆయన అంటున్నారు. కాంగ్రెస్ తో కాని, మరెవరితో కాని జత కట్టవలసిన అవసరం రాదని ఆయన అభిప్రాపడ్డారు. రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన ఘనత టీఆర్ఎస్ దేనని తెలంగాణ ప్రజలందరూ బలంగా నమ్ముతున్నారని , తెలంగాణ పునర్నిర్మాణం కూడా టీఆర్ఎస్ తోనే సాధ్యమని ప్రజలు భావిస్తున్నారని ఆయన చెబుతున్నారు.