Site icon TeluguMirchi.com

ఏం జరిగినా సీఎందే బాధ్యత: హరీష్ రావు

harish-raoటీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పై తీవ్ర స్థాయి లో మండి పడ్డారు. ముఖ్యమంత్రి కేవలం 13 జిల్లాలకే పరిమితం అయ్యారని, తెలంగాణను పాలించే నైతిక హక్కు ను కోల్పోయారని అన్నారు. రేపు హైదరాబాదులో ఏం జరిగినా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, డీజీపీ దినేష్ రెడ్డిలదే బాధ్యతని హరీష్ రావు హెచ్చరించారు. హైదరాబాదులో సమైక్యవాదులు సభ వెనుక సీఎం, డీజీపీల కుట్ర ఉందని హరీష్ రావు ఆరోపించారు. హైదరాబాదులో తెలంగాణ జేఏసీ శాంతి ర్యాలీకి ఎందుకు అనుమతించలేదని ఆయన ప్రశ్నించారు. సీఎం, డీజీపీల ద్వంద్వ వైఖరికి నిరసనగానే రేపు హైదరాబాద్ బంద్ నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ మేరకు హరీష్ రావు టీఆర్ఎస్ శాసనసభా పక్షనేత ఈటెల రాజేందర్ తో కలిసి హైదరాబాదులో మీడియాతో మాట్లాడారు.

Exit mobile version