అసెంబ్లీ సమావేశాల్లో అడుగుపెట్టబోతున్న మంత్రి హరీష్ రావు..

మంత్రి హరీష్ రావు ఈరోజు నుండి అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాబోతున్నాడు. అసెంబ్లీ సమావేశాల ప్రారంభానికి ముందు కరోనా పాజిటివ్ రావడం తో ఈయన ఇంటికే పరిమితమయ్యారు. తాజాగా ఈయన కు కరోనా నెగిటివ్ రావడం తో ఈరోజు నుండి సమావేశాలకు హాజరు కాబోతున్నాడు.

ఈ రోజు సమావేశాల్లో భాగంగా శాసనమండలిలో సీఎం కేసీఆర్ నూతన రెవెన్యూ చట్టాన్ని ప్రవేశపెట్టనున్నారు. ఈ సందర్బంగా తెలంగాణ రైట్స్ ఇన్ లాండ్ అండ్ పట్టాదార్ పాస్ బుక్స్ బిల్ -2020 ను మండలి ఆమోదం కోసం కేసీఆర్‌ చర్చకు పెట్టనున్నారు. ఈ నేపథ్యంలో ఆర్థిక శాఖకు సంబంధించిన బిల్లులను హరీష్ రావు సభలో ప్రవేశపెట్టనున్నారు.