Site icon TeluguMirchi.com

హరీష్ రావు అరెస్ట్ !

Harish-raoతెరాస సీనియర్ నేత హరీష్ రావును సిద్ధిపేట పోలీసులు అరెస్ట్ చేశారు. బయ్యారం గనులపై సీఎం వ్యాఖ్యలకు నిరసనగా తెరాస ఈరోజు (శుక్రవారం) మెదక్ జిల్లా బంద్ కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. తెరాస మెదక్ జిల్లా బంద్ సందర్భంగా.. హరీష్ నేతృత్వంలో తెరాస నాయకులు సిద్ధపేట బస్టాండ్ ఎదుట నిరసనకు దిగారు. భారీ ఎత్తున పాల్గొన్న తెరాస శ్రేణులు కాంగ్రెస్ ప్రభుత్వానికి, సీఎం కిరణ్ కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సమయం గడుస్తున్నా కొద్ది.. తెరాస నేతల తాకిడి పెరుగుతుండటంతో.. కాస్త ఉద్రిక్త పరిస్థితి ఏర్పడే ప్రమాదం ఉందని భావించిన పోలీసులు హరీష్ రావు తో పాటుగా, తెరాస నేతలందని అరెస్ట్ చేసి స్థానిక పోలీస్ స్టేషన్ కు తరలించినట్లు తెలుస్తోంది.

అంతకుముందు హరీష్ మాట్లాడుతూ.. విశాఖ స్టీల్స్.. ప్లాంట్ ను బయ్యారంలోనే ఏర్పాటు చేస్తే 35 వేల మందికి ఉపాధి కలుగుతుందని అన్నారు. తెలంగాణ వనరులను ముఖ్యమంత్రి  దోచుకుంటానని బహిరంగంగా అంటుంటే మిగిలిన పార్టీలు వత్తాసు పలకడం ఏమిటని ఆయన ప్రశ్నించారు.

Exit mobile version