Site icon TeluguMirchi.com

తెదేపాకి హరీష్ సవాల్

tdp-and-harish-rao

తెరాస సీనియర్ నేత హరీష్ రావు తెదేపాకు సవాల్ విసిరారు. తెరాస బై ఎలక్షన్స్ పార్టీ మాత్రమేనని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు ఎగతాళి చేస్తున్నారని… టీడీపీ కంటే టీఆర్ఎస్ కు ఒక్క సీటు ఎక్కువొచ్చినా… తెలంగాణలో టీడీపీ దుకాణం మూసుకుంటారా.. ?? అని ప్రశ్నించారు. బీజేపీతో జతకట్టడం ఒక చారిత్రక తప్పిదం అని గతంలో మాట్లాడిన చంద్రబాబు… ఇప్పుడు మళ్లీ మోడీకి దగ్గరయ్యారని ఎద్దేవా చేశారు. మరీ.. హరీష్ సవాల్ కు తెదేపా ఎలా స్పందిస్తుందో.. ! కాగా, తెలంగాణలో గరీబోళ్ల పాలన రావాలంటే తెదేపా గెలిపించాలని వరంగల్ ప్రజాగర్జన చంద్రబాబు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.

Exit mobile version