Site icon TeluguMirchi.com

అడగాల్సినవి చాలా ఉన్నాయి : హరికృష్ణ

harikrishna-respond-on-flexనందమూరి కుటుంబంలో.. ఎన్టీయార్ ఫ్లెక్సీ వివాదం రోజుకో మలుపు తిరుగుతుంది. నిన్న బాబాయ్(బాలకృష్ణ) జూనియర్ స్పందిచాల్సిందే అని హెచ్చారించిన నేపథ్యంలో.. జూ. ఎన్టీఆర్ నుంచి ఏదైనా ప్రకటన రావొచ్చొమోనని అభిమానులు ఆశపడ్డారు. అయితే ఈరోజు (సోమవారం) టీడీపీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు హరికృష్ణ, బాలయ్య వ్యాఖ్యలపై స్పందింస్తూ.. నేను అడగాల్సిన ప్రశ్నలు చాలా ఉన్నాయని, సందర్భం వచ్చినప్పుడు తప్పకుండా అడుగుతానని అన్నారు. కాగా, ఆదివారం కృష్ణా జిల్లాలో బాలకృష్ణ విలేకరులతో మాట్లాడుతూ.. ఫ్లెక్సీ వివాదంపై జూ. ఎన్టీఆర్ స్పంచాల్సిందేనని, లేనియేడల తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించిన విషయం తెలిసిందే.

Exit mobile version