Site icon TeluguMirchi.com

బాబు@64 !

chandrababunayuduఆంధ్రపదేశ్ ముఖ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా పరిచయం చేసిన తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు జన్మదినం నేడు. బాబు నేడు 64 సంవత్సరంలోకి అడుగుపెట్టారు. అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించాడానికి ఎంత పరితపించాడో, ఇప్పుడు ప్రతిపక్షంలోనూ అందులోనూ.. 64 ఏళ్ల వయసులో ప్రజలను కాంగ్రెస్ కబంద హస్తాల నుండి రక్షించడానికి రెట్టింపు ఉత్సాహంతో “వస్తున్నా.. మీకోసం” పాదయాత్ర కొనసాగిస్తున్నారు. అయితే, బాబు నేటి జన్మదిన వేడుకలను దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. ఢిల్లీలో ఐదేళ్ల చిన్నారిపై జరిగిన దారుణ ఘటనకు నిరసనగానే తన పుట్టినరోజును నిర్వహించుకోవడంలేదని చెబుతూ, ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించవద్దని కార్యకర్తలకు బాబు సూచించారు. మరోవైపు బాబు “వస్తున్నా.. మీకోసం” పాదయాత్ర నేటితో 200వ రోజుకు చేరింది. ప్రస్తుతం విశాఖలో కొనసాగుతున్న బాబు పాదయాత్ర ఈ నెల 27 తో ముగియనుంది. రాష్ట్రాభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమించే తెదేపా అధినేత చంద్రబాబు నాయుడి తెలుగు మిర్చి డాట్ కామ్ తరపున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు

Exit mobile version