రీల్స్ చేసే వారికి తెలంగాణ ప్రభుత్వం బంపర్ ఆఫర్ ఇచ్చింది. తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ పై రీల్స్ చేస్తే ఏకంగా లక్ష రూపాయల వరకు బహుమతి ఇవ్వనున్నట్టు ప్రకటించింది. హ్యాపెనింగ్ హైదరాబాద్ షార్ట్ వీడియో కాంటెస్ట్ పేరుతో హైదరాబాద్ అభివృద్ధిపై ఇన్స్టాగ్రామ్ రీల్స్, ఫేస్బుక్ రీల్స్, యూట్యూబ్ షార్ట్స్ కాంపిటీషన్ ఏర్పాటు చేసింది తెలంగాణ డిజిటల్ మీడియా వింగ్.
కాగా గత 9 ఏళ్లలో హైదరాబాద్ లో జరిగిన అభివృద్ధిపై వీడియో చేయాల్సి ఉంటుంది. ఇక వీడియో నిడిది 60 సెకన్లకు మించకుండా ఉండాలి. ఆ తర్వాత ఈ వీడియో ను సోషల్ మీడియాలో అప్లోడ్ చేసి @DigitalMediaTS కు ట్యాగ్ చేయాలి. అలాగే ఆ వీడియో లింక్ ను dir_dm@telangana.gov.in కు మెయిల్ చేయాలి. కాగా ఏప్రిల్ 30వ తేదీ వరకూ టైం ఉంది. ఇకపోతే పూర్తి వివరాలు https://it.telangana.gov.in/contest/ ఈ లింక్ లో చూడొచ్చు.
Great with Reels? Love Hyderabad? Here's something exciting for you!
Capture the charm and vividness of #HappeningHyderabad and share with us by tagging @DigitalMediaTS
Win cash prizes worth Rs 1,00,000/-
Entries close on April 30. For details visit https://t.co/8J20OoaI9v pic.twitter.com/oaL1KTlI0Y
— Telangana Digital Media Wing (@DigitalMediaTS) April 4, 2023