గుంటూరు హై ఎలర్ట్ నెలకొంది. కరోనా వైరస్ రోజు రోజుకు విజృంభిస్తుండటంతో గుంటూరులో లాక్డౌన్ పూర్తి స్థాయిలో అమలు జరుగుతోంది. మందుల దుకాణాలు మినహా వేటినీ పోలీసులు అనుమతించడం లేదు. నిత్యావసరాలు, పాలు, కూరగాయల దుకాణాలు సైతం ఇవాళ మూసివేశారు. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు మాంసం, చికెన్ విక్రయాలపై అధికారులు నిషేధం విధించారు.
సామూహిక ప్రార్థనలకు అనుమతించేది లేదంటూ ఇప్పటికే జిల్లా యంత్రాంగం ఆదేశాలు ఇవ్వగా.. ఇవాళ ఈస్టర్ ప్రార్థనలు ఇళ్ల వద్దే జరుపుకొన్నారు. గుంటూరు జిల్లాలో ఇప్పటి వరకు మొత్తం 75 కేసులు నమోదు కాగా, గుంటూరు అర్బన్ పరిధిలోనే 56 కేసులు నమోదయ్యాయి.