హైదరాబాద్ నడిబొడ్డున కాల్పులకు తెగబడ్డ సెక్యూరిటీ గార్డు..

హైదరాబాద్ లో మరోసారి తుపాకీ మోత మోగింది. పగ్గపగలు హైదరాబాద్ నడిబొడ్డున తుపాకీ మోత స్థానికులను పరుగులుపెట్టించింది. గన్‌ఫౌండ్రీ SBI ఏటీఎం దగ్గర సెక్యూరిటీ గార్డు సర్దార్‌ ఖాన్‌.. తన సహోద్యోగిపై కాల్పులు జరిపాడు. ఈఘటనలో కాంట్రాక్ట్ ఉద్యోగి సురేందర్‌కు తీవ్రంగా గాయాలయ్యాయి. దీంతో బ్యాంక్ సిబ్బంది, స్థానికుల సాయంతో హుటాహుటీన ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బ్యాంక్ సిబ్బంది ఫిర్యాదు మేరకు ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. కాల్పులు జరిపిన సర్దార్‌ఖాన్‌ను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం పోలీసులు సర్దార్ ను విచారిస్తున్నారు. ఈ ఘటన తో అంత ఉలిక్కిపడ్డారు.