Site icon TeluguMirchi.com

గుజరాత్‌ బాధ్యతలను యోగికి అప్పగించిన మోడీ!!

yogi-adityanathరాష్ట్రంలో ఎక్కన్న అసెంబ్లీ ఎన్నికలు జరిగినా కూడా అక్కడ బీజేపీ దుమ్ము రేపుకుంటూ దూసుకు వెళ్తుంది. మోడీ ఆధ్వర్యంలో బీజేపీ దేశంలో రోజు రోజుకు బలం పుంజుకుంటూనే ఉంది. తాజాగా జరిగిన అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీజేపీ భారీ విజయాలను సొంతం చేసుకున్నాయి. ముఖ్యంగా యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో సంచలన విజయాన్ని సొంతం చేసుకున్న బీజేపీ త్వరలో జరుగనున్న గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికలపై దృష్టి పెట్టింది.

ప్రధాని నరేంద్ర మోడీ సొంత రాష్ట్రం అయిన గుజరాత్‌పై సహజంగానే బీజేపీ పట్టు కోసం ప్రయత్నించడం కామన్‌. గుజరాత్‌లో మరోసారి అధికారం బీజేపీ చేపట్టాలని జాతీయ స్థాయి నాయకులు పట్టుదలతో ఉన్నారు. ఈ సమయంలో మోడీ చాలా క్రియాశీలకంగా వ్యవహరించాల్సి ఉంటుంది. గుజరాత్‌లో మోడీ అత్యధిక సభలు మరియు సమావేశాలు నిర్వహిస్తారని అంతా భావించారు. అయితే షాకింగ్‌గా గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల బాధ్యతను తన నెత్తిన వేసుకోకుండా తాజాగా యూపీకి సీఎం అయిన యోగి ఆదిత్యనాధ్‌కు అప్పగించడం జరిగింది.

యోగి పూర్తి స్థాయి గుజరాత్‌ ఎన్నికల వ్యూహకర్తగా, ప్రచారక కర్తగా వ్యవహరించాలని బీజేపీ నాయకత్వం నిర్ణయించింది. ఇప్పటికే యోగి ఆదిత్యనాథ్‌కు ప్రధాని మోడీ ఈ విషయమై చెప్పడం జరిగింది. గుజరాత్‌ను హిందుత్వ పేరుతో యోగి ఆదిత్యనాథ్‌ బీజేపీ ఖాతాలో వేస్తాడని అధినాయకత్వం భావిస్తుంది. మరి బీజేపీ పెద్దు పెట్టుకున్న నమ్మకంను యూపీ సీఎం యోగి నిలుపుకుంటాడా అనేది చూడాలి.

Exit mobile version