ఎంట్రీ లెవల్ వెహికల్స్ పై ప్రస్తుతం ఉన్న జీఎస్టీని 28శాతం నుంచి 18శాతం తగ్గించాలని ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్ (FADA) కోరింది. దీనికి సంబంధించి లేఖను కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి సమర్పించింది. జీఎస్టీని.. ఎంట్రీ లెవల్ ద్విచక్ర వాహనాలకు 18శాతానికి తగ్గించడం కేవలం ఆర్థిక వ్యూహం మాత్రమే కాదు.. ఇది సామాన్యులకు సాధికారత కల్పించడం.. గ్రామీణ చలనశీలతను పెంచడమని ఎఫ్ఏడీఏ అధ్యక్షుడు మనీష్ రాజ్ సింఘానియా అన్నారు.