గుడ్ న్యూస్ : జీఎస్టీతో నిత్యావసర వస్తువుల ధరలు తగ్గనున్నాయ్

జీఎస్టీ (వస్తు, సేవల పన్ను) అమలుతో నిత్యావసర వస్తువుల ధరలు తగ్గనున్నాయి. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఓ ప్రకటన చేసింది. దాదాపు 1211 వస్తువుల్లో ఆరు మినహా మిగతా వాటన్నింటికీ జీఎస్టీ ధరలను నిర్ణయించినట్లు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి అరుణ్‌జైట్లీ వెల్లడించారు. జీఎస్టీ పన్ను విధానం నుంచి పాలు, పప్పుధాన్యాలకు పన్ను మినహాయించారు. పంచదార, టీపొడి, కాఫీ పొడి, వంటనూనెపై 5శాతం పన్ను విధించనున్నారు.  హెయిర్‌ ఆయిల్‌, సబ్బులు, టూత్‌పేస్టుల ధరలు పెరగనున్నాయి. మొత్తంగా.. జీఎస్టీ అమలుతో సామాన్యుడికి మేలు జరగనుంది.

స్వాతంత్య్రానంతర భారతదేశంలో చేపట్టిన అతిపెద్ద ఆర్థిక సంస్కరణ ఇది. 2006లో ఆర్థికమంత్రి హోదాలో చిదంబరం ప్రతిపాదించిన వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) చట్టం ఎన్డీయే హయాంలో అములులోనికి రానుంది. దేశంలోని 29 రాష్ర్టాల్లో కనీసం సగం రాష్ర్టాల శాసనసభలైనా ఈ బిల్లుపై అంగీకారముద్ర వేయటం తప్పనిసరి. ఇప్పటికే తెలుగు రాష్ట్రాలు జీఎస్టీ బిల్లుకు ఆమోదం తెలిపాయి.