Site icon TeluguMirchi.com

వరంగల్ లో ప్రభుత్వ సూపర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్

వరంగల్ లో నూతనంగా నిర్మించబోయే ప్రభుత్వ సూపర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం,బిల్డింగ్ డిజైన్ మరియు ఇతర అంశాలపై ఆర్ అండ్ బి మరియు మెడికల్ అండ్ హెల్త్ శాఖల అధికారులతో రాష్ట్ర రోడ్లు-భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు.

వరంగల్ లో అత్యధునాతన సౌకర్యాలతో సూపర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారని మంత్రి వేముల అన్నారు. భారత దేశంలోనే అతిపెద్ద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కట్టిన అనుభవం గల ముగ్గురు ఆర్కిటెక్ లతో మంత్రి స్వయంగా మాట్లాడారు. ముఖ్యమంత్రి ఆలోచనల మేరకు దేశంలోనే అత్యంత సౌకర్యవంతమైన అన్ని విభాగాల సమూహంతో కూడిన ఆస్పత్రిగా ఉండే విధంగా ప్లాన్లు తయారు చేయించాలని ఆర్కిటెక్ట్ లకు మంత్రి సూచించారు.

Exit mobile version