విశ్వరూప్ రాజీనామా ఆమోదం

P-Vishwaroopసమైక్యాంధ్రకు మద్దతుగా మంత్రి విశ్వరూప్ చేసిన రాజీనామాను గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ఆమోదించారు. తాను రాజీనామా చేస్తున్నట్లు రెండు రోజుల క్రితమే ప్రకటించిన విశ్వరూప్, ఆ మేరకు నేరుగా గవర్నర్ వద్దకు కూడా వెళ్లి రాజీనామా లేఖను ఆయనకే అందించిన విషయం తెలిసిందే. ఆయన విజ్ఞప్తి మేరకు విశ్వరూప్ రాజీనామాను గవర్నర్ నరసింహన్ ఆమోదించారు.