ప్రస్తుతం జిమ్‌కి వెళ్లి వర్కౌట్ చేసే ట్రెండ్ ఎక్కువగా పెరిగింది. చెప్పాలంటే ఒక ఫ్యాషన్ గా మారింది. అయితే జిమ్ కి వెళ్లాలంటే ఖర్చుతో కూడుకున్న పని. కొందరు దీన్ని భరించగలిగితే, మరికొందరు మాత్రం చార్జెస్ ను చూసి వెనకడుగు వేస్తారు. అయితే దీన్ని దృష్టిలో ఉంచుకుని సామాన్య ప్రజలు సైతం వినియోగించుకునేలా కర్ణాటక రాష్ట్రంలోని ఉడిపిలో ప్రభుత్వ జిమ్ ను ఏర్పాటు చేశారు.
అది కూడా చాలా ఖరీదైన ఎక్విప్ మెంట్ విత్ ఏసి తో ఈ జిమ్ ను ఏర్పాటు చేసారు. అంతేకాదు నామమాత్రపు రుసుముతోనే ఈ ఎయిర్ కండిషన్డ్ ఫిట్‌నెస్ సెంటర్ ను వినియోగించుకోవచ్చట. ఇక ఈ ఫిట్‌నెస్ సెంటర్‌ను ఫిషరీస్, యువజన సాధికారత మరియు క్రీడల మాజీ మంత్రి ప్రమోద్ మధ్వరాజ్ మంజూరు చేసారు.
No…it's not Gold's Gym ❌
It's ….Government Gym in Udupi ✅💪🏋️@LifeFitness, @precor and other Class 1 fitness equipment are imported from 🇺🇲
This State of the Art Air-conditioned fitness centre is open for the general public at a nominal fee, Please do visit 🙏 pic.twitter.com/cBvsQ9pxBs
— Visit Udupi (@VisitUdupi) March 7, 2024