గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఢిల్లీలో భేటీ అయ్యారు. మోదీ నాయకత్వంలో భారత్లో వేగంగా మార్పులు వస్తున్నాయని అన్నారు. ఈ మేరకు ట్వీట్ చేసిన సుందర్ పిచాయ్.. జీ20 కూటమికి భారత్ అధ్యక్షత వహించడాన్ని ప్రస్తావించారు. ఈ విషయంలో తాము ఇండియాతో కలిసి పనిచేస్తామని తెలిపారు. మోదీ నేతృత్వంలో దేశంలో సాంకేతిక పరమైన మార్పులు వేగంగా జరుగుతున్నాయని కితాబిచ్చారు.