ఆంధ్రప్రదేశ్ రేషన్ డీలర్లకు తీపి కబురు తెలిపారు రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి . ఏప్రిల్, మే నెలల కమీషన్ను ప్రభుత్వం విడుదల చేసింది. ప్రభుత్వం ఉచితంగా సరఫరా చేసిన బియ్యం, కందిపప్పుకు సంబంధించి రేషన్ డీలర్లకు కమీషన్ను విడుదల చేస్తున్నట్లు శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.
డీలర్లకు రూ.36.36 కోట్ల కమీషన్ విడుదల చేసినట్లు తెలియపరు. ఒకట్రెండు రోజుల్లో నేరుగా డీలర్ల ఖాతాల్లో కమీషన్ జమ కానున్నట్లు వెల్లడించారు. కిలో బియ్యానికి 70 పైసలు, కిలో కందిపప్పుకు 55 పైసల చొప్పున కమీషన్ చెల్లించినట్లు తెలిపారు. ఏప్రిల్ నెలలో 3.18 లక్షలు, మే నెలలో 3.26 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేసినట్లు మీడియా కు తెలిపారు.