ముహుర్తం ’మూడు’నే.. !!

Congress-high-Commandరాష్ట్ర విభజనపై కేంద్రం జెట్ వేగంతో దూసుకెళ్తుతోంది. షెడ్యూల్ కు ముందే పని పూర్తి చేసే దిశగా కాంగ్రెస్ అధిష్టానం అడుగులు వేస్తోంది. ఇప్పటికే విభజనపై జీవోఎం నివేదికను కూడా ఖరారు చేసింది. ఖరారైన నివేదికను డిసెంబర్ 4వ తేదిన కేంద్ర కేబినేట్ ముందుకు వస్తోందని హోంశాఖ మంత్రి సుశీల్ కుమార్
షిండే వెల్లడించిన విషయం తెలిసిందే.

రాష్ట్ర విభజన ప్రక్రియన వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ప్రయత్నిస్తున్న అధిష్టానం.. విభజన నివేదికను అనుకున్న సమయానికంటే ఒకరోజు ముందే.. అంటే డిసెంబర్ 3వ తేదీనే కేంద్ర కేబినేట్ ముందుకు తీసుకురావడానికి ప్రణాళికను సిద్ధం చేసింది. ఈ మేరకు ఈరోజు షిండే ఓ ప్రకటన కూడా చేశారు. అయితే, హైదరాబాద్ పై ఉన్న ఆప్షన్ల పై ఇంకా చర్చ జరుగుతుందని… డిసెంబర్ 3తేదీ లోపు నిర్ణయం కూడా తీసుకోవచ్చని ఆయన పేర్కొనడం విశేషం.

కేబినేట్ ను ప్రత్యేక సమావేశం ద్వారా విభజన నివేదిక ఆమోదింపజేసి.. అటు నుంచి రాష్ట్రపతి పిమ్మట రాష్ట్ర అసెంబ్లీ పంపేందుకు చకచక పావులు కదుపుతోంది కాంగ్రెస్ హైకమాండ్. షెడ్యూల్ ప్రకారం చూస్తే.. డిసెంబర్ 6 లేదా 7వ తేదీలోగా విభజన బిల్లు అసెంబ్లీకి వచ్చే అవకాశం వున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.