10జిల్లాల తెలంగాణకే కేంద్రం మొగ్గు.. ?

sonia-tవిభజన నివేదికపై నెలకొన్న సస్పెన్షన్ వీడినట్లయింది. పది జిల్లాల తెలంగాణ ఏర్పాటుకే కేంద్రం మొగ్గు చూపుతున్నట్లు కాంగ్రెస్ పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. చివరి నిమిషంలో కేంద్రం రాయల తెలంగాణను పక్కకు పెట్టినట్లు సమాచారం. విభజనపై ఏర్పాటైన మంత్రుల బృందం రాయల తెలంగాణ వైపు మొగ్గు చూపుతున్నట్లు వార్తలొచ్చినప్పటికినీ….. దీనిపై తెలంగాణ నేతలు తీవ్ర అభ్యంతరం తెలపడం తదితర కారణాల వల్ల దానిని పక్కకు పెట్టినట్లు సమాచారం. దీంతో.. ఈరోజు సాయంత్రం జరగబోయే కేంద్ర కేబినేట్ పది జిల్లాల తెలంగాణకు ఆమోదం తెలపనుంది. అయితే, పదిజిల్లాల తెలంగాణనే కేంద్రం ఫైనల్ చేసిందనే వార్తల నేపథ్యంలో.. పది సంవత్సరాలు ఉమ్మడి రాజధానిగా వుండే హైదరాబాద్ పై ఎలాంటి ఆంక్షలు విధించారనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.